Homeటాప్ స్టోరీస్హీరో - హీరోయిన్ ల పెళ్లి ఫిక్స్ అయ్యిందట

హీరో – హీరోయిన్ ల పెళ్లి ఫిక్స్ అయ్యిందట

Wedding date finalized for actress Sayesha saigal and Aryaబాలీవుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా ఏ చిత్ర రంగంలో చూసినా సినిమాలో కలిసి నటించిన పలువురు హీరో- హీరోయిన్ లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . అయితే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా ఇప్పటికి కూడా కాపురం చేసుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం విభేదాలతో విడిపోయారు . విడిపోయిన వాళ్ళని పక్కన పెడితే తాజాగా మరో హీరో హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు .

అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ సాయేషా సైగల్ తమిళ హీరో ఆర్య ని కొంతకాలంగా ప్రేమిస్తోంది . బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మనవరాలు అయిన సాయేషా సైగల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది . అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కొట్టలేకపోయింది . దాంతో ఆర్య తో లవ్ లో పడింది . ఇన్నాళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట మార్చిలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది . మార్చి 9 న పెళ్లి 10 న రిసెప్షన్ జరుగనున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Wedding date finalized for actress Sayesha saigal and Arya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All