
రెడ్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హీరో రామ్..ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ది వారియర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా రామ్ కనిపిస్తుండడం..రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను భారీ ధరకు అమ్ముడు పోగా.. తాజాగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ ధరకు స్టార్ మా ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇక డిజిటల్ రైట్స్ సైతం డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. రామ్ కెరియర్ లోనే ఇదే పెద్ద అమౌంట్ అని చెపుతున్నారు. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు రామ్. దీంతో అందరికి ఈ సినిమా ఫై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటె ఈరోజు మహాశివరాత్రి సందర్బంగా ఆదిపిని శెట్టి తాలూకా పోస్టర్ ను అధికారికంగా ప్రకటించారు.