Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెప్పనున్న అప్డేట్ ఏంటి?

ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెప్పనున్న అప్డేట్ ఏంటి?

ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెప్పనున్న అప్డేట్ ఏంటి?
ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెప్పనున్న అప్డేట్ ఏంటి?

బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ముందుగా ఏడాది కాలంలో ఈ చిత్రాన్ని పూర్తి చేద్దామని రాజమౌళి భావించాడు కానీ ఆర్ ఆర్ ఆర్ కూడా బాహుబలి తరహాలోనే లేట్ అవుతూ వచ్చింది. మూడేళ్లకు పైగా సాగిన షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. సినిమాను ఐదు భాషల్లో జనవరి 7వ తారీఖున విడుదల చేస్తున్నట్లు జక్కన్న అండ్ కో ఇప్పటికే ప్రకటించారు కూడా.

ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ త్వరలోనే పూర్తి స్థాయి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందు రానున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి కీలకమైన అప్డేట్ ఒకటి వస్తుందని చెబుతున్నారు. అది కూడా ఈరోజో, రేపో ఆ అప్డేట్ ఏంటో తెలుపుతారట. ఆర్ ఆర్ ఆర్ కు చెందిన టీమ్ నుండి తెలుస్తోంది ఏంటంటే ఈ చిత్ర ఇంగ్లీష్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందిట. దీన్ని ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయనుందని అంటున్నారు.

- Advertisement -

వార్నర్ బ్రదర్స్ నిర్మించిన సినిమాలను మన వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం చూసాం కానీ మన సినిమాను ప్రతిష్టాత్మక వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మన తెలుగు సినిమా, రాజమౌళి మరికొన్ని మెట్లు పైకి ఎక్కినట్లే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All