Homeటాప్ స్టోరీస్అరవింద సమేత పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

అరవింద సమేత పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

War between ntr fans and anti fansయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది . అరవింద సమేత వసూళ్లు అన్నీ రాంగ్ అని ఫ్లాప్ అయ్యిందని , వసూళ్లు రాకపోయినా వంద కోట్ల షేర్ సాధించినట్లు చూపిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊర్కుంటారా వాళ్ళు కూడా ఎదురు దాడి చేస్తూ లెక్కలు చూపిస్తున్నారు . అయితే ఈ లెక్కలన్నీ తప్పని వాదన చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ . మొత్తానికి అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ఏమో కానీ వివాదాలతో సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది .

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత కు దసరా సెలవులు తోడయ్యాయి దాంతో భారీ వసూళ్లు వచ్చాయి . మొదటి మూడు రోజులు బాగానే వసూల్ చేసినప్పటికీ ఆ తర్వాత జోరు తగ్గింది . అయితే దసరా సెలవులు కాబట్టి బయ్యర్లకు నష్టాలు రాకుండా చేయడంలో సఫలం అయ్యింది . ఓవర్ సీస్ లో నష్టాలు తప్పడం లేదు కాకపోతే పెద్ద నష్టం కాదు కాబట్టి సర్దుకుపోతున్నారు . ఇక నైజాం లో తప్ప మిగతా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కాలేదు కాకపోతే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకునే పనిలో ఉన్నారు . ఒకవేళ మొత్తం సొమ్ము తిరిగి రాకపోయినా కొద్దిపాటి తేడా మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ ఫరవాలేదు . నిర్మాతకు ఎలాగూ సినిమా రిలీజ్ కి ముందే భారీగా లాభాలు వచ్చాయి కానీ బయ్యర్లకు మాత్రమే అంతగా గిట్టుబాటు కాలేదు .

- Advertisement -

English Title: War between ntr fans and anti fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All