Homeగాసిప్స్పవన్ కళ్యాణ్ సినిమాతో వివి వినాయక్ కు లింక్ ఏంటి?

పవన్ కళ్యాణ్ సినిమాతో వివి వినాయక్ కు లింక్ ఏంటి?

పవన్ కళ్యాణ్ సినిమాతో వివి వినాయక్ కు లింక్ ఏంటి?
పవన్ కళ్యాణ్ సినిమాతో వివి వినాయక్ కు లింక్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కమర్షియల్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ఎంతగానో ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడిక్ డ్రామా హరిహర వీర మల్లు కాగా మరొకటి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళం సూపర్ హిట్ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్.

- Advertisement -

పరిస్థితులు అనుకూలించాక ఈ రెండు చిత్రాల షూటింగ్స్ ఊపందుకుంటాయి. అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలో పవన్ కు ధీటైన పాత్రలో రానా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ కామియోను దర్శకుడు వివి వినాయక్ పోషిస్తున్నాడట. ఒరిజినల్ లో స్వయంగా ఆ దర్శకుడే కామియోలో కనిపించగా ఇక్కడ వినాయక్ చేత ఆ పాత్ర చేయిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All