Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ ఫైనల్స్ లో వీరే.. మీ ఓటు ఎవరికి?

బిగ్ బాస్ ఫైనల్స్ లో వీరే.. మీ ఓటు ఎవరికి?

బిగ్ బాస్ ఫైనల్స్ లో వీరే.. మీ ఓటు ఎవరికి?
బిగ్ బాస్ ఫైనల్స్ లో వీరే.. మీ ఓటు ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు ఇక ఫైనల్ దశకు చేరుకుంది. టాప్ 6 లోంచి ఈరోజు శివజ్యోతి ఎలిమినేట్ అవ్వడంతో ఇక టాప్ 5 లో రాహుల్, బాబా, శ్రీముఖి, వరుణ్, అలీ ఉన్నారు. వీరు టైటిల్ కోసం జరిగే పోటీలో రేసులో ఉంటారు. నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖిని సేవ్ చేయగా, వరుణ్, అలీ, శివజ్యోతి నామినేషన్స్ లో ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం.. వారి చిత్రం మీకు మాత్రమే చెప్తా ప్రమోషన్స్ కు వచ్చారు.

- Advertisement -

ఎపిసోడ్ మధ్యలో వరుణ్ ను సేవ్ చేసిన నాగార్జున ఇక లాస్ట్ అలీ, శివజ్యోతిలను ఉంచారు. తర్వాత బిగ్ బాస్ అని ఆంగ్ల అక్షరాలతో ఉన్న బోర్డును పెట్టారు. అందులో అక్షరాల వెనకాల ఒకరి ఫోటో ఉంటుంది. ఎవరి ఫోటో అయితే ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు. ఒక్కొక్క అక్షరం తీస్తూ రాగా లాస్ట్ లో శివజ్యోతి ఫోటో ఉండడంతో ఆమె ఎలిమినేట్ అయింది. ఇక హౌజ్ లో ఒకే లేడీ కంటెస్టెంట్ మిగిలినట్లైంది. వెళ్తూ వెళ్తూ శివజ్యోతికి ఇంట్లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ తో గుడ్ మెమరీ, బ్యాడ్ మెమరీ చెప్పగా.. బాబా భాస్కర్ తో కాలేజీ టాస్క్ లో జరిగిన ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకుంది. అలాగే గుడ్ మెమరీస్ ఎన్నో ఉన్నాయని, నేను హౌజ్ లో నవ్వడానికి 90 శాతం రీజన్ బాబా భాస్కర్ మాత్రమేనని చెప్పింది శివజ్యోతి.

అలాగే శ్రీముఖి తనను చిన్న పిల్లలా ఎత్తుకుంటుందని, అది తనకు గుడ్ మెమరీ అని చెప్పింది. శ్రీముఖితో బ్యాడ్ మెమరీ నామినేషన్ సమయంలో జరిగిందని కాబట్టి దాన్ని ఎక్కువ కన్సిడర్ చేయనని చెప్పింది. హౌజ్ మొత్తంలో అన్న అనేది ఒక్క వరుణ్ నే అని, ఒక అన్నను చూసిన ఫీలింగ్ వరుణ్ అన్నను చూస్తే వస్తుందని శివజ్యోతి చెప్పింది. అలీతో ఉన్న బ్యాడ్ మెమరీ తను ఎలిమినేట్ అయినప్పుడు కలిగిందని, కానీ ఇప్పుడు నేను ఎలిమినేట్ అవుతూ అదే బ్యాడ్ మెమరీని తనకిచ్చి వెళుతున్నానని చెప్పింది. రాహుల్ తో కూడా బ్యాడ్ మెమరీ అంటే టాస్క్ విషయంలోనే జరిగింది కాబట్టి అది మెమరీ అనుకోనని, గుడ్ మెమరీస్ అంటే బోలెడు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ఇది అయిపోయిన తర్వాత మరో టాస్క్ ఉందని చెప్పాడు నాగార్జున. ఒకే ఒక్క పూల మాల, నాలుగు ముళ్ల మాలలు ఇచ్చి హౌజ్ మేట్స్ కు వేయమని చెప్పగా.. లేడీ అయిన కారణంగా శ్రీముఖికి పూల మాల ఇస్తున్నానని చెప్పింది. నేను లేను కాబట్టి శ్రీముఖి విన్ అవ్వాలని ఆకాంక్షించింది. ఇందులో మరో ఆసక్తికర అంశం.. అలీని నాగార్జున అడిగాడు. ఒకవేళ శివజ్యోతి ప్లేస్ లో నువ్వు, నీ ప్లేస్ లో శివజ్యోతి ఉండే అవకాశమిస్తే బయటకి వచ్చేస్తావా అని అడగగా.. తనను నమ్మి ఓట్లు వేసిన వారిని డౌన్ చేయలేనని అందుకే రానని అన్నాడు.

మొత్తానికి శివజ్యోతి ఎలిమినేషన్ జరిగిపోయింది. ఇక మిగిలిన ఐదుగురి కంటెస్టెంట్స్ కు అప్పుడే ఓటింగ్ మొదలైపోయింది. హాట్ స్టార్ లో కానీ ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు ఓటు వేయవచ్చు. ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో ఎవరు విన్ అవుతారన్నది చెప్పడం కష్టంగా ఉంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts