Homeటాప్ స్టోరీస్ఓటర్ రివ్యూ

ఓటర్ రివ్యూ

voter review
voter movie poster

నటీనటులు : మంచు విష్ణు, సురభి
సంగీతం : ఎస్ ఎస్ తమన్
నిర్మాత : జాన్ సుధీర్ పూదోట
దర్శకత్వం : జి ఎస్ కార్తీక్
రేటింగ్ : 3 .25/5
విడుదల తేదీ ‘: 21 జూన్ 2019

మంచు విష్ణు – సురభి జంటగా నటించిన చిత్రం ఓటర్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించేలా రూపొందిందా ? లేదా తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

కథ :
అమెరికాలో ఉండే గౌతమ్ ( మంచు విష్ణు) ఉప ఎన్నికల్లో ఓటు వేయడానికి హైదరాబాద్ వస్తాడు. అయితే అక్కడ తాను ఫేస్ బుక్ లో ఇష్టపడే అమ్మాయి (సురభి) కనిపించడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లక్కీగా ఆ అమ్మాయి ఇంటికే వెళ్లి పెళ్లి చూపులు చూస్తాడు. అయితే పెళ్లి సెట్ అవ్వదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన రాజకీయ నాయకుడి చేత అన్ని హామీలు నెరవేర్చేలా చేయమని ఛాలెంజ్ విసురుతుంది. దాంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించిన గౌతమ్ రాజకీయ నాయకులను ఎలా ఎదుర్కొన్నాడు. ఓటర్ గా ఎలా ఆడించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :
రీ కాల్ కాన్సెప్ట్
ఓటర్ విలువ తెలియజెప్పే అంశం
సురభి గ్లామర్

నటీనటుల ప్రతిభ :
మంచు విష్ణు నటన గురించి కొత్తగా చెప్పేదేముంది , యధాలాపంగా బాగానే చేసాడు. ఓటర్ విలువ గురించి చెప్పే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక సురభి తన వంతు పాత్రని బాగా పోషించింది. అలాగే గ్లామర్ తో బాగా అలరించింది. విలన్ గా సంపత్ రాజ్ మెప్పించాడు. పోసాని నవ్వులు పూయించాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం :
నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాని చక్కని సందేశం తో నిర్మించారు సుధీర్ పూదోట. అలాగే ప్రశాంత్ గౌడ్ ఈ చిత్రాన్ని విడుదల చేసి తన సత్తా చాటాడు. ఇక దర్శకుడు కార్తీక్ విషయానికి వస్తే ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే మంచి పాయింట్ ని ఎంచుకొని మంచి ప్రయత్నం చేసాడు. అయితే స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా బాగుండేది.

ఓవరాల్ గా :
రీకాల్ నేపథ్యంలో మెప్పించిన ఓటర్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All