Homeటాప్ స్టోరీస్వివాహ భోజనంబు మూవీ రివ్యూ

వివాహ భోజనంబు మూవీ రివ్యూ

Vivaha Bhojanambu Review in Telugu
Vivaha Bhojanambu Review in Telugu

నటీనటులు: సత్య, సందీప్ కిషన్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ తదితరులు
దర్శకుడు: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: కెఎస్ సినిష్, సందీప్ కిషన్
సంగీత దర్శకుడు: అనివీ
సినిమాటోగ్రఫీ: మణి కందన్

రేటింగ్ : 2.25/5

కమెడియన్ గా ఒక స్థాయిని అందుకున్న సత్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం వివాహ భోజనంబు. సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు క్యామియో పాత్రలో నటించిన చిత్రం ఓటిటి సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా.

- Advertisement -

కథ:
మహేష్ (సత్య) హైదరాబాద్ లో చిన్నపాటి ఉద్యోగం చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. డబ్బు విషయంలో పొదుపుగా ఉండే మహేష్ అనిత (ఆర్జవి రాజ్)ను తొలిచూపులోనే చూసి ఇష్టపడతాడు. ఎలాగైతేనేం పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అయితే పెళ్లి పనులకని మహేష్ వద్దకు వచ్చిన పెళ్లి కూతురు కుటుంబం లాక్ డౌన్ కారణంగా వాళ్లింట్లోనే ఉండిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగించడం, దాని వల్ల మహేష్ పడే ఇబ్బందుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

నటీనటులు:
తన కామిక్ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకునే సత్య ఈ వివాహ భోజనంబు చిత్రంలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. మిడిల్ క్లాస్ చిరుద్యోగిగా సత్య నటన ఆకర్షిస్తుంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా అన్ని ఎమోషన్స్ ను పలికించిన తీరు మెప్పిస్తుంది. హీరోయిన్ ఆర్జవి కూడా ఆకట్టుకుంటుంది.

మిగతా నటీనటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. మిగిలిన వాళ్ళు కూడా మెప్పిస్తారు. ఇక కామియో పాత్రలో సందీప్ కిషన్ రావడం కొసమెరుపు. ఈ పాత్ర కూడా బాగా పండింది.

సాంకేతిక నిపుణులు:
వివాహ భోజనంబు టెక్నికల్ గా పర్లేదు అనిపిస్తుంది. మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల ఎడిటింగ్ ఇంకా బాగుంటే బాగుండును అనిపిస్తుంది. కథగా రామ్ అబ్బరాజు మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్క్ చేసుంటే బాగుండేది. కథనం ఫ్లాట్ గా సాగిపోతుంది. చాలా వరకూ ఊహించిన సన్నివేశాలే వస్తాయి. దీంతో ఒక దశ తర్వాత ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా:
ముందే చెప్పుకున్నట్లు వివాహ భోజనంబు కథ కాంటెంపరరీగా అనిపించినా కథనం ప్రధాన లోపంగా మారుతుంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు, సత్య పెర్ఫార్మన్స్ మినహా వివాహ భోజనంబు ఫ్లాట్ గా సాగి నిరుత్సాహపరుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All