
బిగ్‌బాస్ సీజన్3పై వితికా షేర్ హాట్ కామెంట్స్ చేసింది. ఈ షోలో మంచి వుందని అదే స్థాయిలో చెడు కూడా వుందని స్పష్టం చేసింది. రోజుకు 24 గంటల జీవితాన్ని బిగ్‌బాస్ వారు గంట మాత్రమే కేటాయిస్తూ క్యారెక్టర్‌లని డిసైడ్ చేస్తుంటారని, ఇందులో పాల్గొనే వాళ్లు చేసేది చూసే వాళ్లకు చాలా అతిగా అనిపిస్తోందని, ఇందుకు నటన కూడా ఓ కారణంగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
`స్పోక్స్ మై హార్ట్ ఔట్` అనే పేరుతో ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా వదిలిన వితిక బిగ్‌బాస్ సీజన్ తరువాత తను ఎంతటి మానసిక క్షోభను ఎదుర్కున్నారో వెల్లడించింది. బిగ్‌బాస్ సీజన్ 3లో వితిక షేరు భర్త వరుణ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చివరి వరకూ పోటీపడిన వితిక ఓటింగ్స్ కారణంగా ఎలిమినేట్ కావడంతో షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వరుణ్ షోలోనే కొనసాగాడు.
ఆ తరువాత తనపై సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ వార్తలు వచ్చాయని వాటి వల్ల తన ఫ్యామిలీ ఎంతో మానసిక ఒత్తిడికి గురైందని వెల్లడించింది. డిజిటల్ మీడియా కొంత మందిపై విష ప్రచారం చేస్తున్నారని, చాలా మంది వ్యతిరేకించినా ఈ విష సంస్కృతిని మాత్రం ఆపలేకపోతున్నారని వాపోయింది. 11 ఏళ్ల వయసలోనే తాను సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టానని నటిగా తనకు గుర్తింపుని భీమిలికబడ్డి జట్టు, జుమ్మంది నాదం, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాల ద్వారా వచ్చిందని తెలిపింది.