Homeటాప్ స్టోరీస్కాద‌ల్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

కాద‌ల్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

కాద‌ల్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!
కాద‌ల్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది!

ఇటీవ‌ల `ఓ పిట్ట‌క‌థ‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విశ్వంత్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `కాద‌ల్‌`.  చిత్ర శుక్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంతో క‌ల్యాణ్ జీ గోగ‌న ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ట‌ఫ్ ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై కిర‌ణ్‌రెడ్డి మందాడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ చిత్ర టీజ‌ర్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

టీజ‌ర్ ని చూస్తుంటే ఈ మూవీ ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ అని తెలుస్తోంది. 2004లో జ‌రిగిన ప్రేమ‌క‌థ అంటూ టీజ‌ర్‌లో చూపించారు. అంద‌మైన అమ్మాయిని చూడ‌గానే ఆమెతో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్ర‌లో విశ్వంత్ క‌నిపించాడు. నా వ‌య‌సు నీకంటే ఎక్కువ‌ని బాధ‌ప‌డుతున్నావా అని హీరోయిన్ చిత్ర శుక్లా అడిగితే అబ్బే ఏజ్ గురించి ఏముంది ఊరికే మాట్లాడ‌టానికి అంటూ మ‌న‌సులోని ప్రేమ‌ను దాచే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు టీజ‌ర్‌లో ఉంది.

- Advertisement -

ఆ అమ్మాయి కూడా నీకు కూడా అక్కేరా అంటూ హీరో తండ్రి అత‌న్ని కంట్రోల్లో పెట్టేందుకు చెప్పే డైలాగ్‌లు స‌ర‌దాగా వున్నాయి. టీజ‌ర్‌లో వినిపించిన థీమ్ మ్యూజిక్ ఎంతో ప్లెజెంట్‌గా ఆక‌ట్టుకునేవిధంగా వుంది. ఓవ‌రాల్‌గా టీజ‌ర్ ఇంట్రెస్టింగ్‌గా వుంది.  ఆశిష్ గాంధీ, రాకేందు మౌళి, దేవి ప్ర‌సాద్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాకెట్ రాఘ‌వ‌, అప్పాజీ అంబ‌రీష్‌, రూపా ల‌క్ష్మి, డీజే దినేష్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All