Homeటాప్ స్టోరీస్ఇంకా అదే కన్ఫ్యూజన్ లో పాగల్

ఇంకా అదే కన్ఫ్యూజన్ లో పాగల్

ఇంకా అదే కన్ఫ్యూజన్ లో పాగల్
ఇంకా అదే కన్ఫ్యూజన్ లో పాగల్

చాలా తక్కువ సినిమాలతోనే హీరో విశ్వక్ సేన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ చిత్రాలు విశ్వక్ కు క్రేజ్ ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటించిన చిత్రం పాగల్. బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పిస్తున్నాడు. పెద్ద బ్యానర్ బ్యాకింగ్ ఉండడంతో పాగల్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది.

కొన్ని వారాల క్రితం పాగల్ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గురించి వార్తలు వచ్చాయి. అయితే దీనిపై విశ్వక్ సేన్ స్పందించాడు. పాగల్ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయడానికి రూపొందించామని పేర్కొన్నాడు. అయినా కానీ రూమర్లు మాత్రం ఆగడం లేదు. పాగల్ టీమ్ కు ఒక ప్రముఖ ఓటిటి సంస్థ నుండి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందట.

- Advertisement -

దిల్ రాజు ప్రస్తుతం యూఎస్ లో ఉన్నాడు. ఇండియా తిరిగిరాగానే పాగల్ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరో వారం, రెండు వారాల్లో పాగల్ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All