తమిళంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అక్కడ ఆడియెన్స్ ను మెప్పించిన సినిమా ఓ మై కడవులే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను మాత్రుక దర్శకుడు అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో అక్కడ హీరోయిన్స్ నే ఇక్కడ రిపీట్ చేస్తున్నారు.
ఓ మై కడవులే తెలుగు రీమేక్ గా ఓరి దేవుడా అంటూ వస్తున్నాడు యువ హీరో విశ్వక్ సేన్. మాస్ కా దాస్ ఇమేజ్ వచ్చినా సినిమా సినిమాకు ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు విశ్వక్ సేన్. ఓరి దేవుడా మోషన్ పోస్టర్ అలరించింది. డైరక్టర్ కూడా ఒకడే కాబట్టి అక్కడ సినిమాను డిటో దించేస్తాడని చెప్పుకోవచ్చు. విశ్వక్ సేన్ సరసన మిథిల పల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రీసెంట్ గా పాగల్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్ మరోసారి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తోనే వస్తున్నాడు.
