
మలయాళ హిట్ చిత్రం ‘అంగనమలై డైరీస్ ‘చిత్రాన్ని తెలుగులో ఫలక్ నుమా దాస్ గా రీమేక్ చేసి హీరోగా , దర్శకుడిగా సక్సెస్ ని సొంతం చేసుకున్నారు విశ్వక్ సేన్ . మొదటి మూవీ తోనే హీరోగా , డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేసి ఆకట్టుకున్న ఈయన ..ప్రస్తుతం లాయర్ గా కనిపించబోతున్నాడు.
“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌ని బట్టి చూస్తే విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్‌గా విశ్వామిత్ర అనే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. SKN సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం అందించారు.