Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్`పాగ‌ల్‌` టీజ‌ర్‌..విశ్వ‌క్ సేన్‌కు మ‌రో హిట్‌..?

`పాగ‌ల్‌` టీజ‌ర్‌..విశ్వ‌క్ సేన్‌కు మ‌రో హిట్‌..?

`పాగ‌ల్‌` టీజ‌ర్‌..విశ్వ‌క్ సేన్‌కు మ‌రో హిట్‌..?
`పాగ‌ల్‌` టీజ‌ర్‌..విశ్వ‌క్ సేన్‌కు మ‌రో హిట్‌..?

`ఫ‌ల‌క్‌నుమా దాస్`, హిట్ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇదే జోష్‌లో వున్న విశ్వ‌క్‌సేన్ తాజాగా మ‌రో విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌తో.. మ‌రో స‌రికొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ‌క్సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `పాగ‌ల్‌`. న‌రేష్ కొప్పిలి ఈ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా  చిత్రం ద్వారా దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

- Advertisement -

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న ఈ మూవీ టీజ‌క్‌ని తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. టీజ‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ రొమాంటిక్‌గా.. ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపిస్తున్నాడు. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే విశ్వ‌క్ సేన్ క్యారెక్ట‌ర్ కొత్త‌గా వుంది.

టీజ‌ర్‌లో `ఎవ‌డ్రా నా అవ‌ర్‌ని ఏడిపించింది? .. రేయ్ నా ల‌వ‌ర్ ఫేస్‌లో హ్యాపీ నెస్ క‌నిపించ‌ట్లేదురా స్ట్రాంగ్‌గా కొట్టండి..వైల్డ్‌గా .. అంటూ విశ్వ‌క్ చెబుతున్న డైలాగ్‌లు సినిమా ఏ స్థాయిలో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేస్తోంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళీశ‌ర్మ‌, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts