
‘వెల్లిపోమాకే’ నుంచి ‘పాగల్’ వరకు యువ హీరో విశ్వక్ సేన్ ఎక్కువగా మాస్ యాక్షన్ జానర్లు చేసారు. అయితే ఈ దఫా కొత్త తరహా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం `పాగల్` మూవీలో నటిస్తున్న విశ్వక్‌సేన్ ఈ మూవీతో పాటు మరో చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అశోక వనం అర్జున కళ్యాణం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీ డిజిటల్ పేరుతో బాపినీడు బి. సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ శుక్రవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఇదే సందర్భంగా టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. లవ్, ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కథ అందించారు.
గత చిత్రాలకు పూర్తి భిన్నమైన మేక్ఓవర్ తో కనిపించబోతున్నాడు. హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి కథ రవికిరణ్ కోల, సంగీతం జయక్రిష్, ఎడిటింగ్ విప్లవ్ నైశాడం, ఛాయాగ్రహణం పావి కె పవన్ అందిస్తున్నారు. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.