విశాల్ పెళ్లి చేసుకునేది వ్యాపారవేత్త విజయ్ రెడ్డి కూతురు అనీషా రెడ్డి ని కదా ! మళ్ళీ అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన నటిని పెళ్లి చేసుకోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? విశాల్ చేసుకునే అమ్మాయి నటి కూడా తెలుసా …….. అనీషా రెడ్డి అనే అమ్మాయి పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించింది . దాంతో అనీషా కూడా నటి అన్నమాట ! అయితే నటన అంటే ఇష్టమున్న అనీషా రెడ్డి ఇక పై పెళ్లి అయ్యాక మాత్రం నటించడం కష్టమే అని అంటున్నారు .
జీకే రెడ్డి తనయుడైన విశాల్ రెడ్డి విశాల్ గా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు . వ్యాపార వేత్త అయిన విజయ్ రెడ్డి కూతురు ని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నాడు విశాల్ . దాంతో విశాల్ ని పెళ్లి చేసుకునేది నేనే అంటూ అధికారికంగా ప్రకటించింది నటి అనీషా . విశాల్ పెళ్లిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగిన విషయం తెలిసిందే . వరలక్ష్మి శరత్ కుమార్ ని ప్రేమించినట్లు , పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే వరలక్ష్మి స్థానంలో అనీషా వచ్చింది .
English Title: Vishal marry arjun reddy actress anisha
SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4