Homeటాప్ స్టోరీస్నాకు `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది: హీరో విశాల్

నాకు `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది: హీరో విశాల్

Vishal likes Shambho Shankara titleశంక‌ర్ ని హీరోగా, శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న `శంభో శంక‌ర` చిత్రం రెండ‌వ లిరిక‌ల్ వీడియో పాట‌ను హీరో విశాల్ విడుద‌ల చేసారు.

భాస్క‌ర‌భట్ల రాసిన ఈ పాట గురించి హీరో విశాల్ మాట్లాడుతూ,` నాకు మొట్ట మొద‌ట‌గా `శంభో శంక‌ర` టైటిల్ బాగా న‌చ్చింది. మీ సినిమా టైటిల్ అయితే నిజంగానే అదిరింది. శంక‌ర్ న‌టించిన రెండు, మూడు సినిమాలు చూశాను. అప్ప‌టికి..ఇప్ప‌టికి చాలా డిఫ‌రెంట్ అనిపించింది. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సాయి కార్తిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్` అన్నారు.

- Advertisement -

చిత్ర క‌థానాయ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ, ` `పందెం కోడి` సినిమా ద‌గ్గ‌ర నుంచి విశాల్ గారు చేసిన చాలా సినిమాలు చూసాను. మంచి న‌టులు. ఆయ‌న చేతుల మీదుగా మా సినిమా పాట‌ విడుద‌ల అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ప్ర‌త్యేకంగా విశాల్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్. మాట్లాడుతూ, ` సాయి కార్తిక్ అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. తొలి పాట‌ను వి.వి.వినాయ‌క్ గారు చేతుల మీదుగా విడుదల చేసాం. ఇప్పుడు రెండ‌వ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియో సాంగ్ ను విశాల్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది హీరో ఇంట‌ర్ డ‌క్ష‌న్ సాంగ్ లా వ‌స్తుంది. ఎంతో భారీగా భాను మాస్ట‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో 4 రోజుల పాటు చిత్రీక‌రించాం` అని అన్నారు.

చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన వై.ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, ` షూటింగ్ తో పాటు, డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ మంచి హిట్ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందిచ‌బోతున్నాం. టీమ్ అంతా రేయింబ‌వ‌ళ్లు ఆరు నెల‌లు పాటు క‌ష్టప‌డి చేసిన సినిమా ఇది` అని అన్నారు.

మ‌రో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` ముందుగా రెండ‌వ పాట‌ను విడుద‌ల చేసిన విశాల్ గారికి థాంక్స్. నా ప్రియ మిత్రుడు భాస్క‌ర భ‌ట్ల ఈ పాట‌ను ఎంతో అద్భుతంగా రాసారు. ఇక సాయి కార్తిక్ మ్యూజిక్ అద్భుతం. జూన్ మొద‌టి వారంలో టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌బోతున్నాం. జూన్ 10వ తేదీక‌ల్లా ఫ‌స్ట్ కాపీ రెడీ చేసి వెంట‌నే సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని జూన్ మూడో వారంలో సినిమా విడుద‌ల చేయ‌బోతున్నాం. బిజినెస్ ప‌రంగా మంచి ఎంక్రజ్ మెంట్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్ అర‌కోటికి పైగా పోటీ ప‌డి ఆదిత్య భాటియా సొంతం చేసుకున్నారు. అలాగే అన్ని ఏరియాల నుంచి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ మ‌రియు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కూడా కురిపించే చిత్రంగా ఈ `శంభో శంక‌ర` నిలుస్తుంది` అని అన్నారు.

ఇందులో శంక‌ర్ స‌ర‌స‌న కారుణ్య నాయిక‌గా న‌టించింది. నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి శంక‌ర్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్, కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తాలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All