
ఇటీవల స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు తమ చిత్రాల రిలీజ్ డేట్‌లతో బాక్సాఫీస్ మీద వార్్‌ని డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రేసులోకి యాక్షన్ చిత్రాల హీరో విశాల్ కూడా వచ్చి చేరాడు. విశాల్ నటిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ `చక్ర`. ఎం.ఎస్. ఆనందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో `జెర్సీ`ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాష్లల్లో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం సోమవారం రిలీజ్ డేట్ ని ప్రకటించింది. లాక్‌డౌన్ సడలించిన సమయంలో ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
గతంలో విశాల్ నటించిన `అభిమన్యుడు` చిత్రానికిది సీక్వెల్. దీంతో ఈ మూవీపై అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్రా హీరోయిన్‌లుగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీపై విశాల్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారట. ఇటీవల వివాదంలో చిక్కుకున్న ఈ మూవీ ఆ వివాదాల్ని పరిష్కరించుకుని థియేటర్లలో సందడి చేయబోతోంది.
Yes, it’s confirmed…
We have planned to release our action thriller film #Chakra in theatres on February 19th in all 4 South Indian Languages. Going to be a grand release. Looking forward to it… GB— Vishal (@VishalKOfficial) February 1, 2021