Homeటాప్ స్టోరీస్`విరాట‌ప‌ర్వం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో!

`విరాట‌ప‌ర్వం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో!

`విరాట‌ప‌ర్వం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో!
`విరాట‌ప‌ర్వం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో!

రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `విరాట‌ప‌ర్వం`. హైలీటాలెంటెడ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `రివ‌ల్యూష‌న్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్‌` అని ట్యాగ్‌లైన్‌. డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ బ్యాన‌ర్‌పై అభిరుచి గ‌ల నిర్మాత సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లు, ఫ‌స్ట్ గ్లింప్స్ , సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన రానా, సాయి ప‌ల్ల‌విల పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచేసింది. మ‌రింత హైప్‌ని క్రియేట్ చేసింది. రానా, సాయి ప‌ల్ల‌వి జోడీ చూడ‌ముచ్చ‌ట‌గా వుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

- Advertisement -

ఇదిలా వుంటే మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 25న ఫ‌స్ట్ సాంగ్ `కోలు కోలు..` లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. గ్రీన్ క‌ల‌ర్ లంగా ఎల్లో క‌ల‌ర్ ప‌రికిణీలో కాక‌తీయ క‌ళాతోర‌ణం ముందు చిందులేస్తూ చిరున‌వ్వులు చిందిస్తున్న సాయి ప‌ల్ల‌వి స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల చిత్రీక‌రించారు. కీల‌క పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితాదాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్‌చంద్ర‌, జ‌రీనా వాహెబ్‌, ఈశ్వ‌రీరావు, సాయిచంద్, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవ ప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి న‌టిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All