Homeఎక్స్ క్లూసివ్వినయ విధేయ రామ ట్రైలర్ టాక్

వినయ విధేయ రామ ట్రైలర్ టాక్

Vinaya vidheya Rama Trailer talk
Ram charan

రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ” వినయ విధేయ రామ ” . జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో భారీ ఎత్తున జరిగింది . కాగా ఆ వేడుకలో ట్రైలర్ ని రిలీజ్ చేసారు . ఇక ట్రైలర్ ఎలా ఉందంటే ……. ఊర మాస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన మెగా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చడం ఖాయం . అలాగే బిసి సెంటర్లలో వినయ విధేయ రామ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది .

ట్రైలర్ లో రాంచరణ్ డైలాగ్స్ డైనమైట్ లా పేలాయి , అలాగే విలన్ గా వివేక్ ఒబెరాయ్ కూడా బలమైన విలన్ గా కనిపిస్తున్నాడు . ఇద్దరు ఉద్దండుల మధ్య భీకర పోరు గా వినయ విధేయ రామ చిత్రం ఉండనుంది . చరణ్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ చిత్రంలో భారీ తారాగణం , భారీ విజువల్స్ ఉన్నాయి . మొత్తానికి రాబోయే సంక్రాంతి కి మెగా ఫ్యాన్స్ కు నిజమైన పండగ అనే చెప్పాలి ట్రైలర్ ని చూస్తుంటే . సినిమాలో కొత్తదనం ఏమి ఉండేలా లేదు కానీ మాస్ కు మాత్రం కావాల్సినంత మసాలా అయితే ఉన్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title:Vinaya vidheya Rama Trailer talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All