Homeఎక్స్ క్లూసివ్వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్లు

వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్లు

Vinaya Vidheya Rama first day box Office Collectionsరాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం మొదటి రోజున దాదాపు 26 కోట్ల షేర్ ని సాధించడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ఎందుకంటే నిన్న విడుదలైన వినయ విధేయ రామ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది , అయితే రాంచరణ్ కు మెగా అభిమానుల అండ ఉంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లు వచ్చాయి . కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే 25. 87 కోట్ల వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమాపై ఎంతగా అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు .
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కు డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి పండగ సెలవులను ఎంతగా క్యాష్ చేసుకుంటే అంతగా వసూళ్లు వస్తాయి , ఆ తర్వాత మాత్రం కష్టమే ! చరణ్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు . ఇది ఏరియాల వారీగా వినయ విధేయ రామ వసూళ్లు చూద్దామా !
నైజాం                            –  5. 08 కోట్లు
సీడెడ్                            –  7. 15 కోట్లు
కృష్ణా                              –  1. 45 కోట్లు
గుంటూరు                      –  4. 17 కోట్లు
ఈస్ట్                                –  2. 05 కోట్లు
వెస్ట్                                 –  1. 83 కోట్లు
వైజాగ్                              –  2. 45 కోట్లు
నెల్లూరు                           –  1. 69 కోట్లు
మొత్తం                             –  25. 87 కోట్లు
English Title: Vinaya Vidheya Rama first day box Office Collections

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All