Homeఎక్స్ క్లూసివ్వినయ విధేయ రామ 6 రోజుల వసూళ్లు

వినయ విధేయ రామ 6 రోజుల వసూళ్లు

Vinaya Vidheya Rama 6 days collections
Ram Charan

రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ 6 రోజుల్లో 46 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది . జనవరి 11 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే డిజాస్టర్ టాక్ వచ్చింది . దాంతో ఈ సినిమా రెండో రోజు నుండి తేలిపోవడం ఖాయమని అనుకున్నారు కానీ సంక్రాంతి సెలవులను ఈ సినిమా బాగానే వాడుకుంది దాంతో 6 రోజుల్లో 46 కోట్ల షేర్ రాబట్టింది .

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించాడు . చరణ్ హీరో కావడం బోయపాటి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది వినయ విధేయ రామ చిత్రం . అయితే సంక్రాంతి సెలవులు రావడంతో ఆ సెలవులను బాగానే క్యాష్ చేసుకుంది ఈ సినిమా . రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటకలో బాగానే వసూల్ చేసింది కానీ ఓవర్ సీస్ లో మాత్రం ఘోరంగా ఉంది ఈ సినిమా పరిస్థితి . అయితే ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాతో బయ్యర్లు చాలానే నష్టపోతున్నారు .

- Advertisement -

English Title: Vinaya Vidheya Rama 6 days collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All