Homeటాప్ స్టోరీస్`కోబ్రా` టీజ‌ర్ టాక్‌: మ్యాథ‌మెటీషియ‌న్ క్రైమ్ స్టోరీ!

`కోబ్రా` టీజ‌ర్ టాక్‌: మ్యాథ‌మెటీషియ‌న్ క్రైమ్ స్టోరీ!

`కోబ్రా` టీజ‌ర్ టాక్‌: మ్యాథ‌మెటీషియ‌న్ క్రైమ్ స్టోరీ!
`కోబ్రా` టీజ‌ర్ టాక్‌: మ్యాథ‌మెటీషియ‌న్ క్రైమ్ స్టోరీ!

ప్ర‌యోగాత్మ‌క  చిత్రాల హీరోగా చియాన్ విక్ర‌మ్‌కు మంచి పేరుంది. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే అదొక ప్ర‌యోగంగానే ప్రేక్ష‌కులు చూస్తుంటారు. అంత‌గా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో విల‌క్ష‌ణ చిత్రాల హీరోగా విక్ర‌మ్ గుర్తింపుని ద‌క్కించుకున్నారు. ఆయ‌న మార్కు చిత్రం కోసం చాలా కాలంగా ప్రేక్ష‌కులు, విక్ర‌మ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ లోటుని తీర్చ‌బోతోంది `కోబ్రా`.

విక్ర‌మ్ విభిన్న‌మైన 20 గెట‌ప్‌ల‌తో స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న ఈ మూవీని అజ‌య్ జ్ఞాన‌ముత్తు తెర‌కెక్కిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఎస్‌. ల‌లిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. `కేజీఎఫ్‌` ఫేమ్ శ్రీ‌నిధిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ త‌మిళ వెర్ష‌న్ టీజ‌ర్‌ని చిత్ర ద‌ర్శ‌కుడు ఈ రోజు (శ‌నివారం) సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కానుంది.

- Advertisement -

భార‌త మాజీ ఫేస్ బౌల‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఓ సాధార‌ణ మ్యాథ‌మెటీషియ‌న్ ఎలా పోలీసుల‌కు టార్గెట్ అయ్యాడు? ద‌ఆని వెన‌కున్న కార‌ణం ఏంటీ? . ఇంత‌కీ కోబ్రా నేప‌థ్యం ఏంట‌నన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విక్ర‌మ్ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసిన తీరు, హ‌రీష్ క‌న్న‌న్ విజువ‌ల్స్‌, భువ‌న్ శ్రీ‌నివాస‌న్ ఎడిటింగ్, ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం సినిమాకు ప్ర‌ధాన హైలైట్స్‌గా నిల‌వ‌నున్నాయి. భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయి చిత్రంగా రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All