
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తోన్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రానికి కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. అయితే కమల్ హాసన్ మరో సినిమాను త్వరగానే పట్టాలెక్కించాడు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో తనను తాను నిరూపించుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కమల్ హాసన్. ఈ చిత్రానికి విక్రమ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది.
కానీ ఇప్పుడు కథలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ సినిమాను ఒక భాగంగా కాకుండా రెండు భాగాలుగా తీయాలని లోకేష్ భావించాడు. కమల్ హాసన్ కు కూడా చెబితే అదే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో బాహుబలి, పుష్ప చిత్రాలకు కూడా అదే జరిగింది.
మొదలుపెట్టినప్పుడు బాహుబలి ఒక భాగమే. డెవలప్ చేసుకుంటూ వెళితే దాని పరిధి పెరిగింది. బాహుబలి రెండు భాగాలుగా మారింది. పుష్ప విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు విక్రమ్ కూడా ఇదే అంటున్నాడు. త్వరలోనే దీనిపై అప్డేట్ రానుంది. కమల్ హాసన్ విక్రమ్ లో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడు.