Homeటాప్ స్టోరీస్తండ్రీ కొడుకుల క్రేజీ గ్యాంగ్ స్టార్ మూవీ!

తండ్రీ కొడుకుల క్రేజీ గ్యాంగ్ స్టార్ మూవీ!

తండ్రీ కొడుకుల క్రేజీ గ్యాంగ్ స్టార్ మూవీ!
తండ్రీ కొడుకుల క్రేజీ గ్యాంగ్ స్టార్ మూవీ!

సినిమా ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు హీరోలుగా సినిమాలు చేస్తే అది చాలా స్పెషల్ గా ఉంటుంది. టాలీవుడ్ లో ఏఎన్నార్ – నాగార్జున, ఎన్టీఆర్ – బాలకృష్ణ, కృష్ణ – మహేష్.. ఇలా తండ్రే కొడుకులు కనిపించిన సినిమాలు అభిమానులకు చాలా ప్రత్యేకం. అయితే పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులు హీరోలుగా చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్ లో కాదు కానీ కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ తరహా ప్రయత్నం జరుగుతోంది.

కోలీవుడ్ లో విక్రమ్, తన కొడుకు ధృవ్ కలిసి సినిమా చేయనున్నారని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు అది అధికారికమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గ్యాంగ్ స్టర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. గన్ తండ్రి తన కొడుక్కి ఇస్తున్నట్లుగా ఆ పోస్టర్ లో ఉంది. ఒక గ్యాంగ్ కు హెడ్ గా ఉన్న తండ్రి, తన కొడుక్కి వారసత్వంగా గన్ ను ఇస్తున్నాడు అనే పాయింట్ ను కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా లలిత్ కుమార్ దీనికి నిర్మాత. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ధృవ్ గతేడాది ఆదిత్య వర్మ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం కాగా విక్రమ్ ప్రస్తుతం పొన్నియన్ సెల్వం, కోబ్రా అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All