
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీకి సంబంధించిన ఐదారుగురు కోవిడ్ బారిన పడటం.. ఆ తరువాత కోలు కోవడం తెలిసిందే. కీరవాణి ఆయన తనయుడు కాలభైరవ కోవిడ్ భారిన పడ్డారు. ఆ తరువాత కోలుకుని తమ ప్లాస్మాని రెండు సార్లు దానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ఫ్యామిలీకి చెందిన మరో వ్యక్తి కోవిడ్ బారిన సడ్డారు. ఆయనే రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు కరోనా సోకినట్టు తెలిపారు. ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా విజయేంద్ర ప్రసాద్‌కు కోవిడ్ సోకడం పట్ల రాజమౌళి అభిమానులు కొంత కలవరానికి గురవుతున్నారు. ఇదిలా వుంటే ఆయనకు ఎలాంటి సమస్యా లేదని, వైద్యుల పర్యవేక్షణలోఉన్నారని తెలిసింది.
విజయేంద్ర ప్రసాద్ త్వరలో విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రాలు `ఆర్ఆర్ఆర్`, తలైవి చిత్రాలకు కథలు అందించారు. `ఆర్ఆర్ఆర్` అక్టోబర్13న విడుదల కానుండగా `తలైవి` ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతున్నాయి.