Homeగాసిప్స్టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?

టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?

టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?
టబు Vs విజయశాంతి.. ఎవరు బెటర్?

ఇప్పుడంతా ఎక్కడ చూసినా హంగామా మొత్తం సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల చుట్టూనే ఉంది. మరో మూడు రోజుల్లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ఒక రోజు తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సందడి చేయనుంది. ఈ రెండు చిత్రాలు చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా మరొకటి మాస్ ను టార్గెట్ చేసిన చిత్రం, అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ సినిమా చేసి, ఇటు మహేష్ బాబు మాస్ ఎంటర్టైనర్ చేసి చాలా సినిమాలైంది. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో కూడా భారీ తారాగణం నటించింది. అయితే వీరిలో ఆసక్తి రేకెత్తించింది ఇద్దరు. వారే విజయశాంతి, టబు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది విజయశాంతి, అలాగే టబు అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ భార్యగా కనిపించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై తిరిగి మెరవనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరి పాత్ర బాగుంటుంది అన్నదానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

- Advertisement -

విజయశాంతి ప్రొఫసర్ భారతి పాత్రలో సరిలేరు చిత్రంలో నటించింది. సినిమాకు కీలకమైన పాత్రగా ఇది ఉండనుందని సమాచారం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుందట. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పాత్ర తరహాలో ఈ చిత్రంలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఇక మరోవైపు అల వైకుంఠపురములో చిత్రంలో టబు పాత్రకు అంత ప్రాధాన్యత లేదని అర్ధమవుతోంది. ట్రైలర్ లోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ తల్లిగా, జయరామ్ భార్యగా టబు ఒక ఫ్యామిలీ పర్సన్ తరహాలో ఈ చిత్రంలో కనిపించనుందని సమాచారం. ఆమెకు స్క్రీన్ టైమ్ బాగానే ఉన్నా ఆమె చుట్టూ తిరిగే పాత్రయితే కాదు.

పాత్ర పరంగా విజయశాంతికి ప్రాధాన్యత ఎక్కువుంటుంది కాబట్టి వీరిద్దరి మధ్యన పోలిక పెట్టడం అన్నది సమంజసం కాదనేది పలువురి అభిప్రాయం. సినిమాలు రెండూ విడుదలయ్యాక ఎవరి పాత్ర ఎలాంటిదో తేలిపోతుంది. అప్పుడు క్లియర్ గా మాట్లాడుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All