
13 ఏళ్ల విరామం తరువాత `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. ఈ మూవీ టైమ్‌లో సూపర్ స్టార్ మహేష్ మేవీ అయినా ఇందులో నటించేందుకు భారీగా పారితోషికం డిమాండ్ చేశానని విజయశాంతి ఓపెన్‌గా చెప్పేసి షాకిచ్చింది. ఇదిలా వుంటే గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో యాక్టీవ్‌గా కనిపించని రాములమ్మ సినిమాల్లో నటించేందుకు కూడా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్‌లో జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారట చిత్ర బృందం. ఇందు కోసం ఆమెకు భారీ ఆఫర్‌ని కూడా ఇచ్చారట. అయితే విజయశాంతి ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.
`సరిలేరు నీకేవ్వరు` తరువాత విజయశాంతికి భారీ స్థాయిలో ఆఫర్లు చుట్టు ముట్టాయి. అయితే తాను సినిమాల నుండి ‘సెలవు’ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లో తటస్థంగా వుంటున్న విజయశాంతికాంగ్రెస్‌ని వీడి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందు కోసమే ఆమె సినిమా ఆఫర్లని తిరస్కరిస్తున్నారట.