
లేడీ సూపర్ స్టార్ ‘విజయశాంతి‘. మొన్నటి దాకా మనం మాట్లాడుకున్నది…13 సంవత్సరాల తర్వాత తెరమీదకి వస్తుంది, అది కూడా ప్రిన్స్ ‘మహేష్ బాబు’, ‘అనిల్ రావిపూడి’ కలయికలో వస్తున్న ”సరిలేరు నీకెవ్వరూ” సినిమాలో మంచి పవర్ఫుల్ క్యారక్టర్ అని విన్నాం. కానీ ఇప్పుడు ఇంకొక వార్త తెగ హడావిడి చేస్తుంది. అదేంటో చూసేద్దాం పదండి.
దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఈ సంవత్సరం తీసిన “ఎఫ్ 2” ఎంత ఘనవిజయం సాధించిందో మనం చూసాం కదా, అయితే ఆ సినిమా విజయోత్సవంలో దిల్ రాజు గారు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని, అందులో ముగ్గురు హీరోలు అని చెప్పిన దిల్ రాజు గారి మాటలు మనం మరచిపోలేము, అనిల్ రావిపూడి గారు కూడా ఇదే మాట చెప్పారు.
అయితే మహేష్ బాబు సినిమా షూటింగ్ కాళీ సమయంలో విజయశాంతి గారికి అనిల్ గారు “ఎఫ్ త్రీ” గురించి చెప్పితే, విజయశాంతి గారు పచ్చ జెండా ఊపేసారు అంటా. మరి అందులో రోల్ అయితే విజయశాంతి గారికి హాస్యమా? లేక ఆమెకి సరిపడే దిట్టమైన క్యారక్టర్ ఆ? అన్నది ఇప్పుడు జనాల్లో ఏర్పడ్డ పెద్ద సందేహం.