
`మాస్టర్` ఫేమ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ `విక్రమ్` పనులతో బిజీగా ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టీజర్ కమల్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. ఇదిలా వుంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఒక ముఖ్యమైన పాత్ర రోసం విలక్షణ నటుడు, హీరో విజయ్ సేతుపతిని సంప్రదించారట.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడానికి తనను సంప్రదించినట్లు విజయ్‌సేతుపతి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. త్వరలోనే విజయ్ సేతుపతి ఈ మూవీకి ఓకే చెప్పడం ఖాయమని చెబుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.
విజయ్ సేతుపతి ఇటీవల లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన `మాస్టర్` చిత్రంలో కీలకమైన విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కమల్‌తో చేస్తున్న `విక్రమ్` ఈ ఏడాది జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.