Homeటాప్ స్టోరీస్విజ‌య్ `మాస్ట‌ర్‌`కు రెండు ఆప్ష‌న్‌లు!

విజ‌య్ `మాస్ట‌ర్‌`కు రెండు ఆప్ష‌న్‌లు!

విజ‌య్ `మాస్ట‌ర్‌`కు రెండు ఆప్ష‌న్‌లు!
విజ‌య్ `మాస్ట‌ర్‌`కు రెండు ఆప్ష‌న్‌లు!

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `మాస్ట‌ర్‌`. `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్జేవియ‌ర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి  విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్లాన్ మారిపోయింది.

తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల్ని మ‌హేష్ కోనేరు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై తాజాగా నిర్మాత మ‌హేష్ కోనేరు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌తనిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. `మాస్ట‌ర్‌` రిలీజ్‌కు రెండు ఆప్ష‌న్‌లు వున్నాయ‌ని, అందులో ఒక‌టి దీపావ‌ళి రిలీజ్‌.. మ‌రొక‌టి వ‌చ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌. ఈ రెండు ఆప్ష‌న్ల‌లో ఏది ఫైన‌ల్ అవుతుంద‌న్న‌ది క‌రోనా క‌ట్ట‌డిని బ‌ట్టి వుంటుంద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల నుంచి వ‌స్తున్న ఆఫ‌ర్ల గురించి ప్ర‌స్తావిస్తూ ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో రిలీజ్ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని, ఈ సినిమా ఖ‌చ్చితంగా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ అవుతుంద‌ని, తాము అంతా థియేట‌ర్ రిల‌జ్ కోస‌మే క‌ట్టుబ‌డి వున్నామ‌ని మ‌హేష్ కోనేరు స్ప‌ష్టం చేశారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో విజ‌య్‌కి జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్ న‌టించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All