
విజయ్ – పూజా హగ్దే జంటగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ‘కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాలతో కోలీవుడ్‌లో దర్శకుడిగా నిరూపించుకున్న నెల్సన్ ఈ మూవీకి డైరెక్షన్ చేయడం, ట్రైలర్, టీజర్‌కు పాజిటివ్ టాక్ రావడంతో ‘భీస్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. పేలవమైన కథ, ఆకట్టుకొని కథనం, డైరెక్షన్ పెద్దగా లేకపోవడం , బలమైన విలన్ లేకపోవడం, నిస్సారంగా సాగే సన్నివేశాలు , మెప్పించని సాంకేతిక విభాగాల పనితీరు ఇలా అన్ని కూడా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షపెట్టాలా ఉండడం తో మొదటి ఆటతోనే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది.
ఈ క్రమంలో తమిళనాడులోని థియేటర్‌లో సినిమా చూస్తున్న కొందరు అభిమానులకు బీస్ట్ సినిమా నచ్చకపోవడంతో స్క్రీన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎంత నచ్చకపోతే మాత్రం మరీ థియేటర్‌కు నిప్పంటిస్తారా? అని అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..దీనికి అభిమానులు మీము అంతే..నచ్చితే పాలాభిషేకం చేస్తాం..నచ్చకపోతే కాల్చేస్తాం అన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఇలాంటి టాక్ తెచ్చుకోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
Frustrated Vijay fans firing Theatres Screens #BeastDisaster
— ? Ajith Kumar? (@Anythingf4AJITH) April 13, 2022