Homeటాప్ స్టోరీస్దేవరకొండ ప్లాప్ సినిమా.. అక్కడ దుమ్ము దులుపుతోంది

దేవరకొండ ప్లాప్ సినిమా.. అక్కడ దుమ్ము దులుపుతోంది

దేవరకొండ ప్లాప్ సినిమా.. అక్కడ దుమ్ము దులుపుతోంది
దేవరకొండ ప్లాప్ సినిమా.. అక్కడ దుమ్ము దులుపుతోంది

ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. మన దగ్గర ప్లాపైన సినిమాలు హిందీ డబ్బింగ్ లోకి వెళ్లి మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంటాయి. ఇప్పుడు ఇదే లిస్ట్ లోకి చేరనుంది దేవరకొండ ప్లాప్ సినిమా. విజయ్ దేవరకొండ నటించిన లాస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ తెలుగులో భారీ ప్లాప్ గా నిలిచిన సంగతి తెల్సిందే. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఈ చిత్ర రీమేక్ హక్కులను విడుదలకు ముందే తీసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ఫలితం తర్వాత ఆ ప్రయత్నాలను మానుకున్నాడు. అయితే ఈ సినిమాను అదే పేరుతో హిందీలో డబ్ చేసి వదిలితే అది సూపర్ డూపర్ హిట్ అయింది.

బేసిగ్గా విజయ్ దేవరకొండకు హిందీ సర్కిల్స్ లో పేరు బానే ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో అక్కడ బాగా పాపులర్ అయ్యాడు మన రౌడీ హీరో. దీంతో పాటు బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన మీటూ ఉద్యమం నేపథ్యంలో సినిమా ఉండడంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తుండడంతో ఇప్పటికే ఈ చిత్రం 6 కోట్ల వ్యూస్ ను దాటేసింది. వీడియో కింద కామెంట్స్ లో కూడా ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదన్న రీతిలో పెడుతుండడంతో తెలుగు ప్రేక్షకులకు అంతలా వీళ్లకు ఈ సినిమా ఏం నచ్చేసిందా అని మరోసారి రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి.

- Advertisement -

మరి డబ్బింగ్ సూపర్ హిట్ అవ్వడంతో కరణ్ జోహార్ మనసు మార్చుకుని రీమేక్ పనులను ముందుకు తీసుకెళ్తాడేమో చూడాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఫైటర్ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయనున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ విడుదల చేయనున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All