Homeటాప్ స్టోరీస్మజిలీ దర్శకుడి రౌడీ మూవీ ఆగిపోలేదా?

మజిలీ దర్శకుడి రౌడీ మూవీ ఆగిపోలేదా?

మజిలీ దర్శకుడి రౌడీ మూవీ ఆగిపోలేదా?
మజిలీ దర్శకుడి రౌడీ మూవీ ఆగిపోలేదా?

రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ లో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే విజయ్ సినిమాలు ప్లాపుల్లో ఉన్నా తనకు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. వరసగా రెండు ప్లాపులు కొట్టినా కానీ ఇప్పుడు విజయ్ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడంటే చూడండి మరి.

పూరి జగన్నాథ్ తో స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. ముంబైలో దాదాపు 40 రోజుల షూటింగ్ జరిగింది. ప్రస్తుతం తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇది కాకుండా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. విజయ్ అయితే ఆ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. దానికి కారణం విజయ్ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ జరగడమే.

- Advertisement -

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అసలు ఆగిపోలేదని కచ్చితంగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. శివ నిర్వాణ ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ సినిమాపై వర్క్ చేస్తాడు. సుకుమార్ పుష్ప పూర్తయ్యేలోగా ఈ రెండు సినిమాలను విజయ్ చేయనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All