Homeటాప్ స్టోరీస్రౌడీ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా!

రౌడీ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా!

రౌడీ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా!
రౌడీ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా!

కాలం క‌లిసొస్తే వార‌స‌త్వం లేకున్నా స్టార్‌డ‌మ్‌ని అందుకోవ‌డం ఏ మంత విష‌య‌మేమీ కాదు. బండెల్స్ కొద్ది టాలెంట్‌, అందుకు త‌గ్గట్టుగా కాలం క‌లిసొస్తే దిమ్మ‌దిరిగే స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నిరూపించారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ యూత్ ఐకాన్ గా మారిపోయి స్టార్‌డ‌మ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా త‌న టాలెంట్‌తో టాప్ హీరోల స‌ర‌స‌న నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త ఏడాది కోసం కొత్త ప్లాన్‌తో జోరు పెంచిన‌ట్టు క‌నిపిస్తోంది.

బాలీవుడ్ రాక్‌ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 2019లో హీరోగా కొంత నిరాశ ప‌రిచిన విజ‌య్ వ‌చ్చేఏడాది మాత్రం టెర్రిఫిక్ ప్లానింగ్‌తో వ‌రుస క్రేజీ చిత్రాల‌తో బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర‌ చేయ‌బోతున్నాడు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్ఠ‌శ‌క‌త్వంలో `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రాన్ని చేస్తున్న ఈ రౌడీ హీరో స్టైలిష్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌తో `ఫైట‌ర్‌` చిత్రాన్ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ బాట‌ప‌డుతున్నారు. దీనితో పాటు మ‌రో క్రేజీ బాలీవుడ్ ఆఫ‌ర్‌ని ప‌రిశీలిస్తున్న విజ‌య్ ఈ సినిమాల‌తో పాన్ ఇండియా స్థాయి హీరోగా వ‌చ్చే ఏడాది క్రేజ్‌ని సొంతం చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ రేంజ్ హీరోగా మాత్ర‌మే సినిమాలు చేసిన విజ‌య్ వ‌చ్చే ఏడాది మాత్రం పాన్ ఇండియా స్థాయి చిత్రాల‌తో హంగామా చేయ‌నున్నాడ‌ని, ఇందుకు పెద్ద ప్ర‌ణాళిక‌నే సిద్ధం చేసుకున్నాడ‌ని అర్ధ‌మ‌వుతోంది. పూరి, య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ చిత్రాల్ని బైలింగ్వ‌ల్ చిత్రాలుగా బ‌య‌టికి తీసుకురాబోతున్న విజ‌య్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించ‌నున్న చిత్రాన్ని కూడా ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స్కెచ్ వేసిన‌ట్టు తెలిసింది. ఈ ప్లాన్ ప‌క్కాగా అమ‌లైతే విజ‌య్ క్రేజ్‌ని ఏ టాలీవుడ్ హీరో అందుకోలేడు. ఆ రేంజ్‌లో రౌడీ ప్లాన్‌ని సెట్ చేసుకోవ‌డాన్నిచూసిన వారంతా వాట్ ఏ ప్లాన్ రౌడీ అని అవాక్క‌వుతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All