
సినిమాల పరంగా విజయ్ దేవరకొండ ఇప్పుడు మంచి స్థితిలోనే ఉన్నాడు. ప్లాపులు వచ్చినా క్రేజ్ కు ఢోకా లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ ఇండియన్ ఐడల్ కాంపిటీషన్ జరిగిన విషయం తెల్సిందే. అందులో ఫైనల్స్ వరకూ వెళ్లిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియ, విజయ్ దేవరకొండకు చాలా పెద్ద ఫ్యాన్.
ఫైనల్స్ లో వీడియో ద్వారా షణ్ముఖకు విజయ్ ప్రామిస్ చేసాడు. “నువ్వు ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచినా గెలవకున్నా నా సినిమాలో నువ్వు పాట పాడబోతున్నావు” అని తెలిపాడు విజయ్. షణ్ముఖ ఫైనల్స్ లో టైటిల్ గెలవకపోయినా ఇప్పుడు తన మాటను నిలబెట్టుకున్నాడు.
లైగర్ సినిమాలో షణ్ముఖ చేత ఒక పాట పాడించాడు. “నేను, పూరి గారు కలిసి నీ వీడియోస్ చూసాము. నీకు ఏ పాట ఇస్తే సెట్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాము” అని షణ్ముఖతో విజయ్ అన్నాడు. మొత్తానికి లైగర్ లో పాడే అవకాశం రావడంతో షణ్ముఖ ప్రియా ఫుల్ హ్యాపీ.
There is no greater happiness than being able to make someone’s dream come true 🙂
Team #Liger welcomes this little rockstar SMP on board our terrific album! https://t.co/w7GnXd3rrn
— Vijay Deverakonda (@TheDeverakonda) September 6, 2021