
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమకాలీన రాజకీయాల గురించి వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పాలించటానికి ఎన్నుకోబడితే నియంతగా ఉండటానికి ఇష్టపడతానని చెప్పాడు. క్రియాశీల రాజకీయాల్లో చేరతారా అని అడిగినప్పుడు విజయ్ దేవరకొండ పై విధంగా సమాధానం ఇచ్చారు.
`ప్రతి ఒక్కరినీ ఓటు వేయడానికి అనుమతించాలని నేను అనుకోను. ఓటర్లకు వారు ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియదు. మద్యం మరియు డబ్బు కోసం ఓటు వేస్తే నేను ఎన్నికలలో నిలబడను. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తాను ఒక నియంతగా ఉండాలనుకుంటున్నానని, వ్యవస్థలో మార్పు రావాలంటే అదొక్కటే మార్గం అని మంచి పనులు చేయడం కోసమే తను నియంతలా వుండాలనుకుంటున్నానని` అన్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో మహేష్ బాబు నటించిన `పోకిరి` అంటే చాలా ఇష్టమన్నారు. ఇక పూరితో చేస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ `ఈ చిత్రంలో ఓ పోరాట యోధుడిగా ఫైటర్‌గా కనిపిస్తానన్నారు. ఇందు కోసం విజయ్ దేవరకొండ తన శరీరాకృతిని ఓ బాక్సర్ తరహాలో మార్చుకుంటున్నారు. మాస్ మసాలా హీరోగా ఈ చిత్రంలో తనన పూరి చూపించబోతున్నారని విజయ్ దేవరకొండ వెల్లడించారు.