Homeటాప్ స్టోరీస్ముంబై వీధుల్లో చార్మీతో రౌడీ విహారం!

ముంబై వీధుల్లో చార్మీతో రౌడీ విహారం!

vijay deverakonda has a lot of trust on me charmee
vijay deverakonda has a lot of trust on me charmee

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి చార్మి, పూరి జ‌గ‌న్నాథ్, అపూర్వ మెహ‌తా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. గ‌త కొంత కొన్నినెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే ముంబైలో మొద‌లైంది.

ప్ర‌స్తుతం ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ ప్ర‌చారం చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లో విజ‌య్ దేర‌కొండ ..చార్మింగ్ లేడీ చార్మీతో క‌లిసి ముంబై వీధుల్లో విహ‌రిస్తున్నారు. యాక్ట‌వ స్కూట‌ర్‌పై చార్మీ డ్రైవ్ చేస్తుండ‌గా.. విజ‌య్ దేవ‌ర‌కొండ వెన‌కాల కూర్చున ముంబై రోడ్ల‌పై హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

- Advertisement -

`విజ‌య్ నాపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. షూట్ గ్యాప్‌లో ఇద్ద‌రం క‌లిసి ముంబై రోడ్ల‌పై ఫ‌న్నీ రైడ్‌కి వెళుతున్నాం` అని యాక్టివ స్కూట‌ర్ పై రైడ్ చేస్తూ సంద‌డి చేస్తున్న ఫొటోస్‌ని చార్మి సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All