
ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకున్నహీరో విజయ్ దేవరకొండ. గత కొంత కాలంగా పరాజయాలు పలకరిస్తున్నా ఈ రౌడీ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఓ ఇంగ్లీష డైలీ నిర్వహించిన సర్వేలో ఆ విషయం స్పష్టమైంది. 30 మోస్ట్ డిజైనబుల్ మెన్స్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనం. యాటిట్యూడ్, డ్రెస్సింగ్ స్టైల్ పరంగా విజయ్ దేవరకొండకు ప్రధమ స్థానం దక్కింది.
ఇదిలా వుంటే విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. బాలీవుడ్ హాట్ ఫేవరేట్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌లతో కలిసి వర్క్ చేయాలన వుందని తన మనసులోని మాటని బయట పెట్టేశాడు. కియారా అద్వానీ, జాన్వీలతో సినిమాలు చేయాలని వుంది. సాధ్యమైనంత తొందరలోనే వారిలో సినిమాలు చేస్తాను. కియారా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమెతో వెంటనే సినిమా చేయాలని వుంది` అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.
విజయ్ దేవరకొండ, కియారా అద్వానీ మెబాజ్ యాడ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న `ఫైటర్` చిత్రంలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.