Homeటాప్ స్టోరీస్రౌడీ ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!

రౌడీ ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!

రౌడీ ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!
రౌడీ ఖాతాలో మ‌రో రికార్డ్ చేరింది!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరే ఓ ట్రెండ్ గా మారింది. పాథ్ బ్రేకింగ్ హిట్ `అర్జున్‌రెడ్డి`తో ఫ్యాన్స్‌కి ముద్దుల రౌడీగా మారిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌తి కాలంలోనూ హ్యూజ్ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకుని టాలీవుడ్‌లో వున్న టాప్ హీరోల్లో ఒకరిగా త‌న‌దైన ముద్ర వేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో య‌మ‌బిజీగా వున్న విజ‌య్ దేవ‌ర‌కొండ లాక్‌డౌన్ స‌మ‌యంలో ది దేవ‌ర‌కొండ షౌండేష‌న్ పేరుతో మిడిల్ క్లాస్ ఫండ్ ని ఏర్పాటు చేసి చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచిన విష‌యం తెలిసిందే.

విజ‌య్ స్పందించిన తీరు ఆయ‌న‌ని ఫ్యాన్స్‌కి మ‌రింతగా ద‌గ్గ‌ర చేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు అంశాల‌పై స్పందిస్తూ నెటిజ‌న్స్‌కి మ‌రింత చేరువ అయ్యారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. ఆయ‌న ఇన్ స్టా గ్రామ్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 10 మిలియ‌న్‌ల‌(కోటి)కి చేరింది. సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో కోటి మంది ఫాలోవ‌ర్స్‌ని ద‌క్కించుకున్న తొలి సౌత్ హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ రికార్డుని సాధించారు.

- Advertisement -

దీంతో రౌడీ ఫ్యాన్స్ ఈ అకేష‌న్‌ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. `1 క్రోర్ ఇన్ స్టా రౌడీ ఫ్యాన్స్‌` అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ దర్శ‌‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో రెండు చిత్రాల్లో న‌టించ‌బోతున్నారు. అందులో శివ నిర్వాణ మూవీ ఒక‌టి కాగా మ‌రొక‌టి సుకుమార్ తెర‌కెక్కించ‌నున్న మూవీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All