HomeUncategorizedరెట్టించిన వేగంతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ట‌!

రెట్టించిన వేగంతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడ‌ట‌!

Vijay-Deverakonda-bounce-back-with-a-bang
Vijay-Deverakonda-bounce-back-with-a-bang

`అర్జున్‌రెడ్డి` సినిమాతో సంచ‌ల‌నం సృష్టించి టాలీవుడ్‌లో  సెన్సేష‌న్‌గా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ త‌రువాత చేసిన టాక్సీవాలా, గీత గోవిందం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల‌ని సొంతం చేసుకోవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్క‌సారిగా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. అయితే ఆ త‌రువాత నుంచే ఆయ‌న‌ని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డం మొద‌లైంది.

నోటా, డియ‌ర్ కామ్రేడ్ రీసెంట్‌గా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌ల‌వ‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ని అయిపోయింద‌ని, ఇక స్టార్‌గా నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌నే పుకార్లు షికారు చేయ‌డం మొద‌లైంది. ఇంతగా త‌న‌పై ప్ర‌చారం జ‌రుగుతున్నా విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం సైలెంట్‌గా త‌న‌ప‌ని తానుచేసుకుపోతున్నారు. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఫైట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

దృష్టినంతా ఈ సినిమాపైనే పెట్టి సీరియ‌స్‌గా వ‌ర్క్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ `ఫైట‌ర్‌` సినిమాతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి త‌నపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు హిట్‌తోనే స‌మాధానం చెప్పాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇందు కోస‌మే త‌ను సైలెంట్ అయ్యాడ‌ని. వ‌న్స్ హిట్ ప‌డితే త‌నేంటో మ‌రుక్ష‌ణంలో చూపించాల‌నుకుంటున్నార‌ట‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All