Homeటాప్ స్టోరీస్ఏం కావాలో `దేవ‌ర శాంటా`ని అడ‌గండి!

ఏం కావాలో `దేవ‌ర శాంటా`ని అడ‌గండి!

ఏం కావాలో `దేవ‌ర శాంటా`ని అడ‌గండి!
ఏం కావాలో `దేవ‌ర శాంటా`ని అడ‌గండి!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరు టాలీవుడ్‌లో ఇప్పుడొక సెన్సేష‌న్‌. `అర్జున్‌రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నాలు మొద‌లుపెట్ట‌న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఏది చేసిన సంచ‌ల‌న‌మే. ప్ర‌తీ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని పుర‌స్క‌రించుకుని విజ‌య్ దేవ‌ర‌కొండ కొంత మందికి స్పెష‌ల్ గిఫ్ట్‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. దాదాపు మూడేళ్ల క్రితం అంటే 2017 నుంచి `దేవ‌ర శాంటా` పేరుతో త‌నని అభిమానించే వారి కోసం ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కొంత కొత్త‌గా ప్లాన్ చేసిన‌ట్టున్నారు. గ‌తంతో పోలిస్తే ఈ ఏడాది ఎవ‌రు ఏది అడిగితే అది ఇచ్చేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశారాయ‌న‌. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. `ఇది దేవ‌ర శాంటా టైమ్‌. ఈ ఏడాది నేను డిసైడ్ అయ్య‌ను. మీకు ఏం కావాలో చెప్పండి నిజంగా ఇచ్చేస్తాను. ఇది వాస్త‌వం. అంద‌రికి ఇవ్వ‌లేక పోయినా క‌నీసం తొమ్మిది ప‌ద మందికైనా ఇస్తాను. అవ‌కాశం వున్నంత వ‌ర‌కు ఎక్కువ మందికి కూడా ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. ఫుల్ ల‌వ్‌, స్మైల్‌, బీ  హ్యాపీ ఏంకావాలో మీరే చెప్పండి` అని విజ‌య్ దేవ‌ర‌కొండ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

మిగ‌తా హీరోల‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల కోసం చేస్తున్న వినూత్న ప్ర‌చారం కూడా ఆక‌ట్టుకుంటోంది. దీంతో అత‌ని క్రేజ్ మ‌రింతగా పెరిగిపోతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`, క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 21న రిలీజ్ కాబోతోంది. దీనితో పాటు పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించ‌నున్న `ఫైట‌ర్‌` చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే నెల సెట్స్‌పైకి రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All