
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగర్`. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మోహతాతో కలిసి పూరి జగన్నాథ్, చార్మి ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ కోవిడ్ కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది.
ఇదిలా వుంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ మన రౌడీ హీరోని ఇన్ స్టాలో ఫాలో అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా క్రేజీ హీరోయిన్ లు ఓ హీరోని ఫాలో చేస్తున్నారంటే వారితో సినిమా కమిట్ అయ్యారని అర్థం. కత్రినా కైఫ్ మన రౌడీ హీరోని ఎందుకు ఫాలో అవుతోందా అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది.
ప్రస్తుతం పూరితో `లైగర్` మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ మూవీ తరువాత ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. ఇందులో విజయ్‌కి జోడీగా బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించబోతోందట. ఆ కారణంగానే కత్రినా మన రౌడీ హీరోని సోషల్ మీడియాలో ఫాలోవర్‌గా మారిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.