Homeగాసిప్స్బుల్లితెర పై కూడా సంచలనం సృష్టించిన గీత గోవిందం

బుల్లితెర పై కూడా సంచలనం సృష్టించిన గీత గోవిందం

Vijay devarakonda's Geetha Govindam gets huge responce from small screen
Vijay Deverakonda and Rashmika Mandanna

వెండితెర పై సంచలనం సృష్టించిన చిత్రం గీత గోవిందం . విజయ్ దేవరకొండ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది . పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూల్ చేసి సంచలనం సృష్టించింది . విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ సినిమాతో మరింతగా పెరిగింది . ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా గత నెలలో టీవీలో ప్రసారం చేసింది కాగా ఆ సమయంలో 20. 18 టీఆర్పీ రేటింగ్ రాగా తాజాగా మరోసారి కూడా టెలికాస్ట్ చేసారు .

 రెండోసారి టెలికాస్ట్ చేసినప్పుడు కూడా మంచి రేటింగ్ వచ్చింది . మొదటిసారి 20 కి పైగా రేటింగ్ రాగా రెండోసారి 17. 16 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట . దాంతో సదరు ఛానల్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు . తక్కువ వ్యవధిలోనే మళ్ళీ టెలికాస్ట్ చేసినప్పటికీ మంచి రేటింగ్ రావడం తో విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ ఏంటి అన్నది తెలిసిపోతోంది . తాజాగా ఈ హీరో నటించిన టాక్సీ వాలా చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది .

 

- Advertisement -

English Title: Vijay devarakonda’s Geetha Govindam gets huge responce from small screen

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All