HomeAudio Reviewsగీత గోవిందం ఆడియో రివ్యూ

గీత గోవిందం ఆడియో రివ్యూ

 Vijay devarakondas Geetha Govindam Audio Reviewగీత గోవిందం ఆడియో రివ్యూ :
దర్శకత్వం : పరశురామ్
నిర్మాత : బన్నీ వాసు
సంగీతం : గోపిసుందర్
నటీనటులు : విజయ్ దేవరకొండ , రష్మిక మండన్నా
ఆడియో : ఆదిత్య
రేటింగ్ : 3 / 5

విజయ్ దేవరకొండ – రష్మిక మండన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ” గీత గోవిందం ”. నిన్న ఈ చిత్ర ఆడియో వేడుక జరుగగా ముఖ్య అథితి గా అల్లు అర్జున్ హాజరయ్యాడు . గోపిసుందర్ సంగీతం అందించిన పాటలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం .

- Advertisement -

1) ఇంకేం ….. ఇంకేం …. ఇంకేం కావాలే
సంగీతం : గోపీసుందర్
రచన : అనంత శ్రీరామ్
సింగర్ : సిద్ శ్రీరామ్

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అనే పాటని సిద్ శ్రీరామ్ రొమాంటిక్ గా ఆలపించాడు . ప్రేమ కోసం పరితపించే గోవిందం లోని ఆవేదన ఈ పాట రూపంలో పలికించాడు అనంత శ్రీరామ్ , ఇక మెలోడీ గా సాగే ఈ పాటని రొమాంటిక్ , క్లాసికల్ టచ్ ఇచ్చారు . ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది .

2) ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస
రచన : శ్రీమణి
సింగర్ : చిన్మయి

శ్రీమణి రాసిన ఈ పాట కు గోపీసుందర్ సంగీతం అందించగా చిన్మయి అద్భుతంగా పాడి ఆ పాటకు మరింత వన్నె తెచ్చింది .

3) వచ్చిందమ్మ వచ్చిందమ్మ
రచన : శ్రీమణి
సింగర్ : సిద్ శ్రీరామ్

మెలోడీ గా సాగే ఈ పాట మరో ఆణిముత్యం అనే చెప్పాలి . శ్రీమణి రాసిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడగా అంతే అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చాడు గోపీసుందర్ .

4) వాట్ ద లైఫ్
రచన : శ్రీమణి
సింగర్ : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ పాడిన ఈ పాటలో సాహిత్య పరంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పెద్ద వివాదమే లేచింది , పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ఈ పాటని యు ట్యూబ్ నుండి తొలగించారు , ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వివాదాస్పదమైన పదాలు మార్చి రాసాడు శ్రీమణి .

5) కనురెప్పల కాలంలోనే
రచన : సాగర్
సింగర్ : గోపీసుందర్

పెద్దగా వాయిద్య హోరు లేకుండా వినసొంపుగా ఉండేలా ఆలపించాడు సంగీత దర్శకుడు , గాయకుడు గోపీసుందర్ . ఈ పాటని గోపీసుందర్ ఆలపించడం విశేషం . ఈ పాట ఈ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది .

ఓవరాల్ గా : యూత్ ని ఆకట్టుకునే పాటలతో ఈ గీత గోవిందం ఆడియో రూపొందింది . గోపిసుందర్ సంగీతం , శ్రీమణి , సాగర్ ,అనంత శ్రీరామ్ ల సాహిత్యం వెరసి గీత గోవిందం యువతని మెప్పించే ఆడియో .

English Title: vijay devarakondas geetha govindam audio review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All