Homeగాసిప్స్డియర్ కామ్రేడ్ కథ లీకయ్యింది

డియర్ కామ్రేడ్ కథ లీకయ్యింది

Dear Comrade
Dear Comrade

డియర్ కామ్రేడ్ కథ ఇదే అంటూ ఓ కథ చక్కర్లు కొడుతోంది . ఆ కథ నిజమెంతో కానీ విని , కనబడుతున్న కథనం ప్రకారం కథ ఎలాగుందంటే …… బాబీ పాత్రలో విజయ్ దేవరకొండ లిల్లి పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నారు . ఇక కథలోకి వెళితే …… విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న లు ఓ కామన్ ఫ్రెండ్ పెళ్ళిలో కలుసుకుంటారు . అయితే రష్మిక మందన్న ని విజయ్ దేవరకొండ అండ్ బ్యాచ్ తక్కువగా అంచనా వేస్తారు , దాంతో నేను మాములు అమ్మాయిని కాదు స్టేట్ క్రికెట్ ప్లేయర్ ని అని చెప్పి షాక్ ఇస్తుంది .

ఆ తర్వాత విజయ్ – రష్మిక ఇద్దరు కూడా క్రికెట్ ఆడుతూ దగ్గరౌతారు , విజయ్ రష్మిక ప్రేమ పొందాలని చూస్తాడు అయితే అతడి యాటిట్యూడ్ నచ్చని రష్మిక నో చెబుతుంది దాంతో కొంతకాలం తర్వాత రష్మిక డిప్రెషన్ తో బాధపడుతోందని ఫోన్ కాల్ ద్వారా తెలుసుకుంటాడు . స్టేట్ క్రికెట్ ప్లేయర్ అవుదామనుకున్న రష్మిక ని తన కోరిక తీర్చాలని కోచ్ పెట్టే హింస భరించలేక క్రికెట్ కు దూరం అయ్యిందని తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఎలా ఫైట్ చేసాడు . చివరకు ఆ ఇద్దరూ కలుసుకున్నారా లేదా అన్నదే డియర్ కామ్రేడ్ కథ అంటూ ప్రచారం సాగుతోంది . అయితే ఈ కథ ఎలా ఉన్నప్పటికీ సినిమా విడుదల రేపే కాబట్టి అసలు కథ రేపు తేలిపోనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All