డియర్ కామ్రేడ్ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే
విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే . ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో టాక్ బయటకు వచ్చింది . ఇంతకీ డియర్ కామ్రేడ్ సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా ……… …యావరేజ్ లేదా జస్ట్ హిట్ అని మాత్రమే అంటున్నారు .
ఫస్టాఫ్ అందరికీ నచ్చేలా ఉందట , అయితే సెకండాఫ్ మాత్రం స్లో నెరేషణ్ వల్ల పైగా ఎక్కువ రన్ టైం ఉండటం కూడా ప్రేక్షకులను అసహనానికి గురిచేసేలా ఉందని అంటున్నారు . ఎక్కువ నిడివి కాస్త ఇబ్బంది పెట్టొచ్చు అని అంటున్నారు . అయితే కొంతమంది అభిప్రాయం మాత్రమే సుమా ! విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం . ఇక ఈ సినిమా యూత్ కి నచ్చితే బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఖాయమే ! అయితే అది ప్రేక్షకుల తీర్పు మీద ఆధారపడి ఉంది .
విజయ్ దేవరకొండ , డియర్ కామ్రేడ్ , ఫిలిం న్యూస్ , రష్మిక మందన్న