Homeటాప్ స్టోరీస్జాన్వీ కామెంట్ పై విజయ్ దేవరకొండ

జాన్వీ కామెంట్ పై విజయ్ దేవరకొండ

Vijay devarakonda wants jahnvi kapoorవిజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని తెల్పిన జాన్వీ కపూర్ మాటలు ఆమధ్య వైరల్ గా మారిన విషయం తెలిసిందే . అయితే జాన్వీ వ్యాఖ్యల పట్ల మొత్తానికి స్పందించాడు హీరో విజయ్ దేవరకొండ . నాకు కూడా జాన్వీ కపూర్ తో నటించాలని ఉందని త్వరలోనే ఆ సినిమా సాకారం కానుందని వ్యాఖ్యానించాడు . కరణ్ జోహార్ మొదట అడ్డుపడ్డాడు జాన్వీ కపూర్ విజయ్ సరసన నటించకుండా , అయితే కరణ్ జోహార్ షోలోనే పాల్గొన్న సందర్బంగా విజయ్ దేవరకొండ లా నిద్ర లేవాలని ఉందని అలాగే అతడి సరసన నటించాలని ఉందని ….. విజయ్ చాలా సెక్సీ గా ఉంటాడని చెప్పి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్ .

విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఇదే నెలలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది . ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది కూడా . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సీ వాలా 20 కోట్ల షేర్ రాబట్టింది . ఇక జాన్వీ కపూర్ కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది అలాగే మంచి నటి అని కూడా నిరూపించుకుంది . ఇక ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు .

- Advertisement -

English Title: Vijay devarakonda wants jahnvi kapoor

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All