Homeటాప్ స్టోరీస్బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ ?

బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ ?

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆనంద్ అన్నామలై అనే దర్శకుడు దర్శకత్వం వహించనున్న చిత్రంలో ఈ హీరో బైక్ రేసర్ గా నటించనున్నట్లు తెలుస్తోంది . క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బైక్ రేసింగ్ సీన్స్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండనున్నాయట ! పైగా యూత్ కి బైక్ రేసింగ్ అంటే విపరీతమైన పిచ్చి , అందునా విజయ్ దేవరకొండ అంటే మరీ పిచ్చి దాంతో ఈ స్క్రిప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారట .

- Advertisement -

ఇక ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . టోటల్ గా సౌత్ పై దృష్టి పెట్టాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది . ఇక ఈ నెలలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts