Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ తో సమంత రొమాన్స్ ..

విజయ్ దేవరకొండ తో సమంత రొమాన్స్ ..

Vijay Devarakonda To Romance Samantha

విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచింది. ఓ పక్క లేడి ఓరియంటెడ్ సినిమాలకు ఓకే చెపుతూనే మరోపక్క ఐటెం సాంగ్స్ కు , హీరోయిన్ రోల్ కు ఓకే చెపుతూ కెరియర్ ను మళ్లీ స్పీడ్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె శాకుంతలం తో పాటు యశోద మూవీస్ చేస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ దక్కిందట. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ నుండి మరో మూవీ రాలేదు. పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ మొదలు పెట్టినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ..ఎట్టకేలకు ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. ఆగస్టు లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే శివనిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని పాన్ ఇండియన్ సినిమా గా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్లే నటి నటుల ఎంపిక చేస్తున్నారు. కాగా ముందుగా ఈ మూవీ లో విజయ్ కి జోడిగా కియారా తో పాటు మరో ఇద్దర్ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు వద్దని సమంత ను ఎంపిక చేశారట. గతంలో విజయ్ – సమంత లు కలిసి మహానటి మూవీ లో నటించారు. ఇక ఇప్పుడు మరోసారి స్క్రీన్ పంచుకోబోతున్నారు. త్వరలో ఈ వార్త ను అధికారిక ప్రకతాం చేయనున్నారట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All